I Love Muhammad: ముంబైలో బలవంతంగా.. బైకులు, కార్లకు ఐ లవ్మహ్మద్ స్టిక్కర్లు..వీడియో వైరల్

I Love Muhammad: ముంబైలో బలవంతంగా.. బైకులు, కార్లకు ఐ లవ్మహ్మద్ స్టిక్కర్లు..వీడియో వైరల్

అది ముంబై.. కుర్లా ప్రాంతం..అక్కడ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలను ఆపి  ఐలవ్ మహ్మద్ అని స్టిక్కర్లు వేస్తున్నారు. ఆ స్టిక్కర్లు ఎందుకు వేస్తున్నారో అర్థంకాక వాహనదారులు కొంతసేపు నివ్వుర పోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది..

యూపీలోని కాన్పూర్​ లో ఐ లవ్​ మహ్మద్​ ఎఫెక్టు అని తెలుస్తోంది. ముంబైలో జరిగిన ఈ స్టిక్కర్​ ప్రచారానికి సంబంధించి సెప్టెంబర్​ 19 తర్వాత సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారు. ముంబైలోని కుర్లాలో బైక్‌లు, రిక్షాలు సహా వాహనాలపై ఐ లవ్ ముహమ్మద్ అని రాసిన స్టిక్కర్లను వ్యక్తులు బలవంతంగా అతికిస్తున్నట్లు చూపించే వీడియోలు బయటకు రావడంతో వివాదం చెలరేగింది. ఈ వీడియోలో కొంతమందివ్యక్తులు వాహనాలను అడ్డగించి అనుమతి లేకుండా స్టిక్కర్లను అంటిస్తున్నట్లు కనిపిస్తోంది. 

ఐ లవ్ మహాదేవ్ బ్యానర్లు

ఈ ప్రచారం త్వరగా ముంబైలో ఘర్షణలకు దారితీసింది. హిందూ సంఘాలు ఐ లవ్ మహాదేవ్ అనే బ్యానర్ కింద నగరం అంతటా సమావేశాలు నిర్వహించాయి. ముస్లిం సంస్థలు రెచ్చగొట్టే ప్రచారం చేస్తున్నాయని ఐ లవ్​ మహదేవ్​ప్రచారాన్ని మరింత సమీకరణపై చర్చించేందుకు అనేక సమావేశం నిర్వహించారు. బజరంగ్ దళ్ వంటి మితవాద సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. 

బ్యానర్లు అశాంతిని సృష్టించేందుకే ప్రచారం చేస్తున్నారని వాదించాయి. మేం బ్యానర్లను వ్యతిరేకించడం లేదు  కానీ వాటి ఉద్దేశ్యంపై మాకు అనుమానం ఉంది. కాశ్మీర్‌లో ఈ బ్యానర్‌లను మోసుకెళ్తున్న వ్యక్తులు పోలీసులను వెంబడించడం ప్రమాదకరమైన సంకేతం అని అంటున్నాయి.