RR vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. రాజస్థాన్ జట్టులో సందీప్ శర్మ

RR vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. రాజస్థాన్ జట్టులో సందీప్ శర్మ

ఐపీఎల్ లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. జైపూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 7 మ్యాచ్ ల్లో ఆరు విజయాలు సాధించిన రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరువవవుతుంది. మరోవైపు ఆడిన 7 మ్యాచ్ ల్లో మూడు విజయాలే సాధించిన  ముంబైకు ఈ మ్యాచ్ గెలవడం కీలకంగా మారింది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది. 

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, మొహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా