దుబాయ్ : ఐపీఎల్లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు,రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ సోమవారం జరిగే తమ థర్డ్ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఫస్ట్ మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓడినా.. కోల్ కతాను చిత్తు చేసిన ముంబై ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఇంకోవైపు హైదరాబాద్ పై విజయంతో లీగ్ ను స్టార్ ట్ చేసిన ఆర్సీబీ గత పోరులో పంజాబ్ చేతిలో ఘోరంగా ఓడి డీలా పడింది.పేస్ బౌలింగ్ వైఫల్యం ఆ జట్టును వేధిస్తోంది.కెప్టెన్ విరాట్ కూడా రెండు మ్యాచ్ ల్లో 14,1 స్కోర్లతో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈమ్యాచ్ లో అయినా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫించ్ , డివిలియర్స్ బాగానే ఆడుతున్నారు. బౌలింగ్ లో చహల్ ,నవ్ దీప్ సైనీ మినహా మిగతా పేసర్లు నిరాశ పరుగుస్తున్నారు. వాళ్లు గాడిలో పడకపోతే బెంగళూరుకు కష్టాలు తప్పవు. మరోవైపు కోల్ కతాతో చివరి పోరులో ముంబై అన్ని డిపార్ట్ మెంట్స్‌లో సత్తా చాటింది. కెప్టెన్ రోహిత్ ఫామ్‌లోకి రావడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.
