ముంబై ఇండియన్స్‌‌‌‌ మెంటార్‌‌‌‌గా జులన్‌‌‌‌

ముంబై ఇండియన్స్‌‌‌‌ మెంటార్‌‌‌‌గా జులన్‌‌‌‌

ముంబై: ముంబై ఇండియన్స్‌‌‌‌ విమెన్‌‌‌‌ టీమ్‌‌‌‌.. తమ కోచింగ్‌‌‌‌ సిబ్బందిని ఫైనలైజ్‌‌‌‌ చేసింది. ఇండియా లెజెండ్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ జులన్‌‌‌‌ గోస్వామిని మెంటార్‌‌‌‌ కమ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా తీసుకుంది. రెండు దశాబ్దాల పాటు ఇండియా టీమ్‌‌‌‌కు ఆడిన జులన్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ లెవెల్లో 350 వికెట్లు తీసింది. విమెన్స్‌‌‌‌ వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జులన్‌‌‌‌.. వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లోనూ రాణించింది. ఈ క్రమంలో 2016లో ఐసీసీ వన్డే బౌలింగ్‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌లో నంబర్‌‌‌‌వన్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను సొంతం చేసుకుంది. గతేడాది ఆటకు గుడ్‌‌‌‌బై చెప్పిన జులన్‌‌‌‌.. బెంగాల్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌కు మెంటార్‌‌‌‌గా పని చేస్తోంది. ఇక ఇంగ్లండ్‌‌‌‌ మాజీ కెప్టెన్‌‌‌‌ చార్లెటీ ఎడ్వర్డ్స్‌‌‌‌ను ఎంఐ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా నియమించుకుంది. చార్లెటీ తన హయాంలో ఇంగ్లండ్‌‌‌‌కు వన్డే, టీ20 వరల్డ్‌‌‌‌కప్స్‌‌‌‌ను అందించింది. ఇండియా మాజీ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ దేవికా ఫల్షికార్‌‌‌‌కు బ్యాటింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ బాధ్యతలు అప్పగించింది. తృప్తి చంద్‌‌‌‌గడ్కర్‌‌‌‌ భట్టాచార్య టీమ్‌‌‌‌ మేనేజర్‌‌‌‌గా వ్యవహరించనున్నారు.