వాంఖడే వార్..బౌలింగ్ చేయనున్న రోహిత్ సేన

 వాంఖడే వార్..బౌలింగ్ చేయనున్న రోహిత్ సేన

మరో కీలకమైన మ్యాచ్కు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్ప గెలవాల్సిన మ్యాచ్ కు రెడీ అయింది. సన్ రైజర్స్తో వాంఖడే వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మరోవైపు ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు నామమాత్రం కానుంది. ఆ జట్టు ఓడినా..గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే తన చివరి మ్యాచ్లో గెలిచి ఐపీఎల్ 2023 సీజన్ను ముగించాలని హైదరాబాద్ పట్టుదలతో ఉంది. 


ముంబై ఇండియన్స్ తుది జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ.

సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు:  మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్),  హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్,  నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ ధగర్,  భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.