
ఐపీఎల్ 2023లో మరో హాట్ పోరుకు అంతా సిద్ధమైంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఢీకొట్టుకోబోతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ తీసుకుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడిన ఢిల్లీ ఒక్కదాంట్లోనే విజయం సాధించలేదు. అటు ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ పరాజయం చవిచూసింది. దీంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. కూడా ఎలాగైనా విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లో ముంబై ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆడే అవకాశం కనిపిస్తోంది.
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నేహాల్ వధీర, హృతిక్ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, జేసన్ బెహ్రెండాఫ్, రిలే మెర్డిత్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, యశ్ దుల్, మనీష్ పాండే, అభిషేక్ పోరెల్, రోవ్‌మెన్ పావెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, నార్ట్జే, ఎం రెహమాన్. కుల్దీప్ యాదవ్.