పబ్​జీ ఆటలో 10 లక్షలు ఖర్చువెట్టిండు..

పబ్​జీ ఆటలో 10 లక్షలు ఖర్చువెట్టిండు..

ముంబై: పదహారేండ్ల పిలగాడు పబ్​జీ ఆటకు బానిసగా మారిండు. ఆట కోసమని అమ్మ బ్యాంక్​ ఖాతా నుంచి డబ్బులు వాడేసిండు. యాభయ్యో, వందో కాదు.. ఏకంగా పది లక్షలు ఖర్చు చేసిండు. విషయం తెలిసి పేరెంట్స్ కోప్పడడంతో లెటర్​ రాసిపెట్టి ఇంట్లోంచి పారిపోయిండు. ఆ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించడంతో వాళ్లు ఆ కుర్రాడిని వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చిండ్రు. ముంబైలోని మహాకాళి ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.. అంధేరీలోని మహాకాళి ఏరియాలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఓ పదహారేండ్ల కుర్రాడు బుధవారం లెటర్​ రాసిపెట్టి ఇంట్లోంచి పారిపోయిండు. ఆ కుర్రాడి పేరెంట్స్ పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కంప్లైంట్ ఇచ్చారు. అయితే, తమ అబ్బాయి ఇట్లా పబ్​జీ ఆడుతూ పది లక్షలు పోగొట్టిన విషయం, దాంతో తాము కోప్పడ్డ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో టెక్నాలజీ సాయంతో పోలీసులు ఆ కుర్రాడి ఆచూకీని కనిపెట్టారు. పిల్లాడిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చాక తల్లిదండ్రులకు అప్పజెప్పారు.