చిన్నారిని ట్యాంకులో పడేసి.. కన్నతల్లి కిడ్నాప్ డ్రామా

చిన్నారిని ట్యాంకులో పడేసి.. కన్నతల్లి కిడ్నాప్ డ్రామా

ముంబై: రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టిందంటూ అత్తింటివాళ్లు వేధించడంతో.. భరించలేక ఓ తల్లి సొంత బిడ్డనే వాటర్ ట్యాంక్​లో పడేసి చంపేసింది. తన పాపను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడంటూ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. విచారణలో అసలు నిజం బయటపడటంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని కాలాచౌకీ ఏరియా ఫెర్బందర్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. కాలనీలోని సంఘర్ష్ సదన్ బిల్డింగ్ లో ఉంటున్న  సప్న బజరంగ్ మగ్దూం(36)కు 2011లో పెళ్లి కాగా, 2013లో ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడల్లా మంత్రగాడి వద్దకు తీసుకెళ్లిన కుటుంబసభ్యులు ఆడపిల్ల పుడుతుందని చెప్పడంతో మూడుసార్లు అబార్షన్ చేయించారు. నాలుగోసారి అబార్షన్​కు ఆమె ఒప్పుకోలేదు. 3 నెలల కిందట మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో అత్తింటివాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. 

ట్యాంక్ లో వేసి.. కిడ్నాప్ కథ 
అత్తింటివాళ్ల వేధింపులతో తీవ్ర మనస్తాపం చెందిన సప్న మంగళవారం భర్త డ్యూటీకి వెళ్లిన తర్వాత పాపను వాటర్ ట్యాంక్​లో వేసింది. పాప మునిగిపోగానే మూత పెట్టింది. ఆ తర్వాత పాపను ఎవరో కిడ్నాప్ చేశారని కట్టుకథ చెప్పింది. పాత బట్టలకు ప్లాస్టిక్ బకెట్ ఇస్తామంటూ ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చాడని, క్లోరోఫాం పూసిన గుడ్డతో తన ముక్కును మూయడంతో స్పృహ తప్పిపడిపోయానని, అతడు తన పాపను ఎత్తుకెళ్లాడని పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్​లో పేర్కొంది.