మంథని, వెలుగు: మంథని పట్టణంలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఆదివారం ఉదయం పట్టణంలోని బస్టాండ్ ఏరియా నుంచి శ్రీపాద చౌరస్తా వరకు రోడ్డు వెంబడి స్థలాన్ని ఆక్రమించి ఉన్న ఫ్లెక్సీలు, నేమ్స్ బోర్డ్స్, హోటల్, ఫ్రూట్ షాప్ల ముందు నిర్మించిన షెడ్లను తొలగించారు.
మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ మాట్లాడుతూ రోడ్డు వెంబడి ఇష్టారాజ్యంగా రేకుల షెడ్లు, పందిళ్లు నిర్మించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈక్రమంలో వాటిని తొలగించినట్లు చెప్పారు.