రూ.147.92కోట్లతో మున్సిపల్​ బడ్జెట్

రూ.147.92కోట్లతో మున్సిపల్​ బడ్జెట్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం మున్సిపల్ బడ్జెట్ ను రూ.147.92కోట్లతో 2023–24 ఆర్థిక సంవత్సరానికి కౌన్సిల్​ఆమోదించింది. చైర్ పర్సన్ కె. సీతాలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కౌన్సిల్​మీటింగ్​లో రూ.84.20లక్షల మిగులుతో బడ్జెట్ ను సభ్యులు ఆమోదించారు. జనాభా అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్ రూపకల్పన జరగలేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు వై. శ్రీనివాస్​రెడ్డి, మునిగడప పద్మ, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, విజయ్, నేరెళ్ల సమైక్య, మాచర్ల రాజకుమారి, మండల ఆమని ఆరోపించారు. గతంలో కిన్నెరసాని మంచినీటి కోసం వరల్డ్​ బ్యాంక్ నుంచి తెచ్చిన రూ.44కోట్లు ఎల్ఐసీ అప్పులు, వ్యయాల ఖాతాలో ఎందుకు చేర్చలేదని మండిపడ్డారు. బలహీన వర్గాలు, మైనార్టీలు నివసించే ప్రాంతాలను ఎక్కడెక్కడ గుర్తించారని, వాటికి కేటాయించిన నిధుల వివరాలు ఎందుకు బడ్జెట్లో లేవని ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్సీల నుంచి నిధులు తేవడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్​కమిషనర్​ రఘు, డీఈ నవీన్​ కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.