
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరారు. కొన్ని నెలల కిందట సొంత పార్టీ కౌన్సిలర్లే, ఇతర పార్టీ నేతలతో కలిసి మున్సిపాలిటీ చైర్ పర్సన్ అవినీతికి పాల్పడుతుందని, ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో స్రవంతి గులాబీ పార్టీకి, నేతలకు దూరంగా ఉంటూ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు.
Also Rard: బోపన్న ఫేర్‌వెల్ విజయం
విజయభేరి సభ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నేత చిలుకా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబంతో సహా చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కు ఊహించని భారీ షాక్ తగిలింది.