
- ఆయనకు సహకరించిన బిల్ కలెక్టర్, జవాన్
- ప్రెస్మీట్లో వైస్‌చైర్మన్ జాబీర్ అహ్మద్
భైంసా, వెలుగు: భైంసా మున్సిపల్‌పరిధిలోని ఇంటి నిర్మాణ అనుమతులు, ధృవీకరణ పత్రాలు సహా ఏ పనుల్లోనూ అవినీతి, అక్రమాలను సహించబోమని వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్స్పష్టం చేశారు. రెండ్రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్రావు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే జాబీర్‌అహ్మద్ గురువారం తన ఛాంబర్లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. కమిషనర్ వెంకటేశ్వర్రావు మున్సిపల్ఆఫీస్లో కాకుండా బయట నోటీసులు టైప్ చేయించి, వాటిని జారీ చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించామన్నారు. ఇందుకు ఆఫీస్‌లోని శానిటరీ సెక్షన్‌కు చెందిన జవాన్ గంగాచారి, బిల్కలెక్టర్విద్యాసాగర్ కమిషనర్‌కు సహకరించారని.. ఈ ముగ్గురూ కలిసి శానిటేషన్ విభాగంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు వెల్లడించారు.
పలువురు రెగ్యులర్ శానిటేషన్ సిబ్బంది విధులకు హాజరు కాకపోయినా హాజరైనట్లుగా వివరాలు నమోదు చేసి వేతనాలు చెల్లిస్తూ వారి వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు, ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి గంగాచారిపైనా చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించి వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రజల నుంచి డబ్బులు అడిగినా, వేధించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.