పార్టీలో గ్రూపు రాజకీయాలు..కేటీఆర్ కు నివేదిక

పార్టీలో గ్రూపు రాజకీయాలు..కేటీఆర్ కు నివేదిక
  • కేటీఆర్​కు నివేదిక ఇచ్చిన టీఆర్ఎస్​ ‘మున్సిపోల్స్’ ఇన్​చార్జులు

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్​లో గ్రూపు రాజకీయాలు నెలకొన్నాయని, రోజురోజుకు పెరిగిపోతున్నాయని ‘మున్సిపోల్స్’ లోక్​సభ నియోజకవర్గాల ఇన్​చార్జులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ కు స్పష్టం చేశారు. పాత, కొత్త నేతల మధ్య పొసగడం లేదని.. ప్రతి లోక్​సభ నియోజకవర్గం పరిధిలో ఇదే పరిస్థితి ఉందంటూ నివేదిక ఇచ్చారు. మున్సిపల్ ఎలక్షన్ల కోసం లోక్​సభ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్​చార్జులను నియమించిన విషయం తెలిసిందే. వారు ఏ మున్సిపాలిటీలో పరిస్థితి ఎలా ఉందన్న దానిపై నివేదిక రూపొందించారు. దానిని బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్ కు అందజేశారు. పార్టీ విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. ప్రతి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లో నాయకులు గ్రూపులుగా విడిపోయారని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే ఒక వర్గంగా ఉంటే కౌన్సిలర్లు/కార్పొరేటర్లు మరో వర్గంగా ఉన్నారని స్పష్టం చేసినట్టు సమాచారం. కరీంనగర్  కార్పొరేషన్ లో మంత్రి గంగులకు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు మధ్య విభేదాలు ఉన్నాయని.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు తాజా మాజీ కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండానే లోకల్​గా పర్యటనలు చేస్తున్నారని వివరించినట్టు తెలిసింది.

వాళ్లు కలవడం లేదు

2018 అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ నుంచి గెలిచి తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు, పార్టీ నుంచి పోటీ చేసి ఓడినవారికి మధ్య విభేదాలు పెరుగుతున్నాయని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.నకిరేకల్ నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా ఉందని మాజీ, తాజా ఎమ్మెల్యేల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందని వివరించినట్టు తెలిసింది. కొల్లాపూర్  నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మధ్య సయోధ్య కుదరడం లేదని.. తాండూరులో కూడా అదే పరిస్థితి ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని.. పాలేరులో తుమ్మల వర్గంవాళ్లు, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి వర్గీయులు కలిసి కూర్చునే పరిస్థితి లేదని పేర్కొన్నట్టు తెలిసింది.

ఉద్యమ నాయకులు దూరమైండ్రు

తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లాల్లో కీలకంగా వ్యవహరించిన నాయకులు ఇప్పుడు పార్టీకి దూరమయ్యారని మున్సిపోల్స్​ ఇన్​చార్జులు నివేదికలో వివరించినట్టు సమాచారం. పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదన్న బాధలో ఉన్నారని.. ఉద్యమం తర్వాత వచ్చిన నాయకులకే గుర్తింపు, పదవులు