మంత్రి ఎర్రబెల్లి ఇంటిని ముట్టడించిన మున్సిపల్ కార్మికులు

మంత్రి ఎర్రబెల్లి ఇంటిని ముట్టడించిన మున్సిపల్ కార్మికులు

మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిని ముట్టడించారు. సీఐటీయూ, టీఎమ్మార్పీఎస్, ఐఎన్టీయూసీ అధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి వరకు ర్యాలీ తీశారు. 

ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులమంతా కలసి నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. దీంతో నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. 

డిమాండ్లు..

  • మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నట్లుగా రూ. 21వేల జీతం ఇవ్వాలి
  • ఖమ్మం, కరీంనగర్ లో లాగా జవాన్లకు డ్రైవర్లకు రూ. 19వేలు ఇవ్వాలి
  • 452 మంది కార్మికులకు జీవో 60 ప్రకారం 15600 వెంటనే ఇవ్వాలి