
- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామిని కేసీఆర్ కలవడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ‘తీసేసిన నాయకులు... ఎవరు ఎవరిని కలిస్తే ఏముంది.. సార పాతదే... సీసా కొత్తదేమో అంతేగా.. మోడీ ఇచ్చిన సుపారితో... యూపీఏకు అధికారం రాకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారు.. అందుకే కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారిని కలవడు.. కాంగ్రెస్ లో ఉన్న నాయకులను మాత్రమే కలుస్తాడు..’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఎంపిక చేశామన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె ఎంపిక జరిగిందని.. 50 సవత్సరాలుగా పాల్వాయి గోవర్ధన్ సేవలు దృష్టిలో పెట్టుకొని... ఆశావాహులు ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్రవంతికి టికెట్ ఇచ్చినందున అందరం కలసి కట్టుగా పని చేస్తామన్నారు. మునుగోడులో స్రవంతిని గెలిపించడానికి కృషి చేస్తామని ఆశావహులు మాట ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహేష్ కుమార్ గౌడ్, పల్లె రవి కుమార్, చెలమల కృష్ణారెడ్డి... అందరికీ వివరించి చెప్పాము... నాయకులు టికెట్ రాకపోయినా... స్ఫూర్తిగా పనిచేస్తారు.. మేమంతా... కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ అవినీతి బయటకు రాకుండా దృష్టి మళ్లిస్తుండు
సీఎం కేసీఆర్ తన అవినీతి బయటకు రాకుండా దృష్టి మళ్లిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలో మూడోసారి బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ రావాలని.. కేసీఆర్ ప్లాన్ అని పేర్కొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి అక్కడ నిమజ్జనం వదిలేసి.. ఇక్కడకు రావడమంటే? చిల్లర రాజకీయాలు ఇవి అన్నారు. బీజేపీ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతినేలా చూస్తున్నారని ఆరోపించారు. హిందువుల ఓట్లు బీజేపీకి, క్రిస్టియన్లు..ముస్లిం ఓట్లు టీఆర్ఎస్ కు పడాలని ప్లాన్.. ఒకరికి ఒకరు సహకారించుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి చెప్పారు. భారత్ జోడో యాత్ర 50వ రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
23 వేల మంది వీఆర్ఏలు 50 రోజులుగా నిరసన తెలుపుతున్నారు... 28 మంది చనిపోయారు.. కేసీఆర్ రాష్ట్రంలోని సమస్యలు వదిలేసి... దేశంలో రాజకీయాలు ఏలతానంటున్నరని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ దేశాన్ని బిజినెస్ మెన్స్ కు దోచిపెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.