
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల్లో లుకలుకలు బయటపడ్డాయి. మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి ఫైలుపై సంతకం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి కొంతమంది జిల్లా నేతలు హాజరు కాలేదు. ఎమ్మెల్యే కూసుకుంట్ల వైఖరి నచ్చకనే రాలేదని బాహాటంగా చెబుతున్నారు. హాజరు కాని వారిలో జిల్లా నేతలు జిల్లా నారబోయిన రవి, పల్లె రవి,కర్నాటి విద్యాసాగర్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.