Sky Trailer: ఫిబ్రవరి 6న థియేటర్లలో ‘స్కై’.. ట్రైలర్‌తో క్యూరియాసిటీ పెంచిన మేకర్స్

Sky Trailer: ఫిబ్రవరి 6న థియేటర్లలో ‘స్కై’.. ట్రైలర్‌తో క్యూరియాసిటీ పెంచిన మేకర్స్

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా పృధ్వీ పెరిచర్ల దర్శకత్వంలో  నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న  సినిమా  ‘స్కై’. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.

ఫ్రెండ్స్ మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ట్రైలర్ మొదలవుతుంది. హీరో హీరోయిన్స్ మధ్య పరిచయం ప్రేమగా మారడం, వారి ప్రేమలోని ఎమోషన్ ఆకట్టుకునేలా చిత్రీకరించారు. హీరో పర్సనల్ లైఫ్ ప్లాష్ బ్యాక్ హార్ట్ టచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. కొన్ని అపార్థాలతో హీరో హీరోయిన్ ప్రేమలోనూ కొన్ని విబేధాలు వస్తాయి.

ఈ జంట ఎలా తిరిగి ఒక్కటయ్యారు, హీరో  ప్లాష్ బ్యాక్ ట్రాజెడీ ఏంటి అనేది ఆసక్తిరేపేలా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆనంద్ భారతి, రాకేష్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో  శివ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.