మురళీ మోహన్ లీడ్ రోల్ లో సుప్రీమ్ వారియర్స్ సినిమా షురూ..

మురళీ మోహన్ లీడ్ రోల్ లో సుప్రీమ్ వారియర్స్ సినిమా షురూ..

మురళీ మోహన్ ప్రధాన పాత్రలో హరి చందన్ దర్శకత్వంలో పెదపూడి బాబురావు నిర్మిస్తున్న చిత్రం ‘సుప్రీమ్ వారియర్స్‌‌’. సోమవారం రామానాయుడు స్టూడియోస్‌‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  ముహూర్తపు షాట్‌‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కెమెరా స్విచాన్‌‌ చేయగా దవళ సత్యం, మురళీ మోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సురేష్, వీర శంకర్, శివ రాజ్ పాటిల్, మార్కాపురం శివ కుమార్, శ్రీనివాస్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. 

‘మొదటి సారి కథ విన్నప్పుడే ఎంతో నచ్చిందని, మంచి విజయాన్ని సాధించాలని మురళీ మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తైవాన్‌‌పై జరిగిన దాడి ఘటనను ప్రేరణగా తీసుకుని ఈ కథ రాశానని, మిలటరీ కుటుంబాల భావోద్వేగాలను ఇందులో చూపించబోతున్నట్టు దర్శకుడు హరిచందన్ చెప్పారు.  దీన్నొక సైన్స్‌‌ ఫిక్షన్‌‌ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌గా  రూపొందిస్తున్నామని నిర్మాత బాబురావు తెలియజేశారు. బాబూ రావు, మహిమా చౌదరి, కల్పన, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, ధవళ సత్యం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.