జైలు నుంచే ఎమ్మెల్యేగా గెలిచిండు.. హత్య కేసు నిందితుడు అనంత్ సింగ్ విజయం

జైలు నుంచే ఎమ్మెల్యేగా గెలిచిండు.. హత్య కేసు నిందితుడు అనంత్ సింగ్ విజయం

పాట్నా: ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్‌‌చంద్ యాదవ్ హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న  జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ ఘన విజయం సాధించారు. మొకామా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. 28,206  ఓట్ల భారీ ఆధిక్యంతో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అభ్యర్థి వీణాదేవిపై గెలుపొందారు. బాహుబలి నేతగా పేరొందిన అనంత్ సింగ్‌‌.. ఎన్నో క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో జైలు నుంచే బరిలో దిగి, ఓటర్ల మద్దతు పొందారు. ఎన్నికల్లో అనంత్ సింగ్ మొత్తం 91,416 ఓట్లు సాధించగా, వీణాదేవికి 63,210 ఓట్లు వచ్చాయి.