
మియాపూర్, వెలుగు: డ్రగ్స్‌కు బానిసలై చికిత్స పొందుతున్న ముగ్గురు వ్యక్తులు గొడవపడగా.. వారిలో ఇద్దరు కలిసి మరో వ్యక్తిని హత్య చేశారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రిహాబిలిటేషన్ సెంటర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సందీప్(39) డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అతనికి చికిత్స అందించేందుకు కుటుంబసభ్యులు 8 నెలల కింద మియాపూర్‌లోని రిహాబిలిటేషన్సెంటర్లో చేర్పించారు.
ఇదే సెంటర్లో డ్రగ్స్‌కు బానిసలైన నల్గొండకు చెందిన ఆదిల్, నగరంలోని బార్కస్‌కు చెందిన సులేమాన్ నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. బుధవారం సాయంత్రం కౌన్సెలింగ్ క్లాస్‌కు వెళ్లే సమయంలో ఈ ముగ్గురూ గొడవ పడ్డారు. ఆదిల్, సులేమాన్ప్లైవుడ్డోర్ముక్కతో సందీప్ ముఖంపై విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని సిబ్బంది దగ్గరలోని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సందీప్అదే రోజు రాత్రి మృతిచెందాడు. పోలీసులు అతని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. సులేమాన్, ఆదిల్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.