రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముషీర్ ఖాన్​ సెంచరీ

రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముషీర్ ఖాన్​ సెంచరీ

ముంబై: అండర్‌‌‌‌‌‌‌‌19 వరల్డ్ కప్ స్టార్ ముషీర్ ఖాన్ (128 బ్యాటింగ్‌‌‌‌) సెంచరీతో సత్తా చాటడంతో బరోడాతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముంబై తడబడి నిలబడింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ముంబై తొలి రోజు చివరకు 248/5 స్కోరు చేసింది. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆంధ్రతో క్వార్టర్స్‌‌‌‌లో మధ్యప్రదేశ్ తొలి రోజు 234/9 స్కోరుతో నిలిచింది.

ఇక,  ఓపెనర్ యష్ దూబే (64) టాప్‌‌‌‌ స్కోరర్. శశికాంత్ 4, నితీశ్ కుమార్ రెడ్డి 3 వికెట్లు తీశారు. మరోవైపు అథర్వ తైడే (109) మరో సెంచరీతో మెరవడంతో  కర్నాటకతో క్వార్టర్స్‌‌‌‌ పోరులో విదర్భ 261/3 స్కోరుతో తొలి రోజు ముగించింది. తమిళనాడుతో మ్యాచ్‌‌‌‌లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 183 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. సాయి కిశోర్ ఐదు వికెట్లతో దెబ్బకొట్టాడు. అనంతరం తొలి రోజు చివరకు తమిళనాడు 23/1 స్కోరుతో నిలిచింది.