
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తే వాళ్లు ఎంత ప్రేమను ఇస్తారో ఈ సినిమాతో చూశా. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఇప్పటివరకూ అరవైకి పైగా సినిమాలు చేశా. ఏ చిత్రానికి రాని ప్రేమ, గుర్తింపు ఈ చిత్రంతో లభించాయి. ఇప్పటికీ మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి.
వివేక్ ఈ కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా, ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యా. చక్కని కమర్షియల్ లైన్ ఇది. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ ఆర్క్ అద్భుతం. టీజర్స్‌లోని మ్యూజిక్ ప్రేక్షకులకు రిజిస్టర్ అవడంతో నా వర్క్ మరింత ఈజీ అయింది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో డైలాగ్స్ వుండవు. బీజీఎంలోనే హై మూమెంట్ వుంటుంది. ఈ మధ్యకాలంలో నేను పని చేసిన బెస్ట్ కమర్షియల్ సినిమా ఇది. ఇక ఓ మ్యూజిక్ కంపోజర్‌గా ప్రేక్షకుల అభిరుచికి తగ్గ మ్యూజిక్ ఇవ్వాలి. అలాగని మన మ్యూజిక్ లో సోల్ మిస్ కాకూడదు. సోల్ వున్న మ్యూజిక్ చాలా కాలం నిలుస్తుంది’ అని చెప్పాడు.