
న్యూయార్క్: కాల్స్ చేసుకోవడం, ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లను పంపించుకోవడం వంటి కొత్త ఫీచర్లను ట్విట్టర్లో అందుబాటులోకి తెస్తామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇందుకోసం ‘ట్విట్టర్ 2.0 ది ఎవ్రీథింగ్ యాప్’ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఇందులో ఎన్‌క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‌లు (డీఎంలు), లాంగ్‌ఫార్మ్ ట్వీట్‌లు, పేమెంట్స్ వంటి సదుపాయాలు ఉంటాయని చెప్పారు. యూజర్లు తమ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మరో ట్విట్టర్ యూజర్‌కు వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చని.. ఇందుకు ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని మస్క్ ట్వీట్ చేశారు.