రాష్ట్రపతి, ప్రధాని,కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు

రాష్ట్రపతి, ప్రధాని,కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ లోని జామా మసీదులో ఉదయం నుంచే ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కరోనా దృష్ట్యా రెండేళ్ల తర్వాత మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.  నెలవంక దర్శనం తర్వాత ఈద్ ఉల్ ఫితర్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 30 రోజులుగా ముస్లింలు చేపట్టిన ఉపవాస దీక్షలు ఇవాళ్టితో ముగిశాయి. వైరస్ తగ్గుముఖం పట్టడంతో కుటుంబ సభ్యులతో  వచ్చి నమాజ్ చేయడం సంతోషంగా ఉందని ముస్లింలు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లోని మసీదుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలు పాటించి రంజాన్ జరుపుకోవాలన్నారు.

ఢిల్లీ జామా మసీదు పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు . మానవాళికి సేవ చేసి.. పేదల జీవితాలు మార్చేందుకు ప్రయత్నించాలన్నారు. ఈ పండుగ ఐక్యత, సౌభ్రాతృత్వ స్ఫూర్తిని పెంపొందించాలన్నారు.

మరిన్ని వార్తల కోసం...

కరోనా నెగెటివ్​ వస్తే ఊరవతలికి..

సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు