పెళ్లి విందులపై ముస్లిం పెద్దల కీలక నిర్ణయం

పెళ్లి విందులపై ముస్లిం పెద్దల కీలక నిర్ణయం

ధరలు ఆకాశన్నంటడంతో పెళ్లి ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు  దెబ్బతినడంతో వివాహ ఖర్చులు మరింత భారమయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ముస్లిం పెద్దలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ముస్లింల పెళ్లిలో అమ్మాయి తరపువారు అనేక తీపి పదార్థాలను సిద్ధం చేస్తారు. చికెన్, మటన్ తో అనేక రకాల వంటలు,బిర్యానీ,చపాతీ రోటీ,కుర్బానీ  కా మీఠా, ఖద్దూ కా కీర్, ఐస్ క్రీం, షేమియా, షీర్ కుర్మా ... ఇలా ఎన్నో ఐటెమ్స్ తయారు చేస్తారు. కరోనా కాలంలో వ్యాపారులు తగ్గాయి. ఎంతో మంది బిజినెస్ లో నష్టపోయారు. దీంతో ఆడపిల్ల  పెళ్లిలో ఒక్పటిలా రకరకాల  ఆహార పదార్థాలతో విందులు చేయడం భారమైంది. పెళ్లికూతురుకు పుట్టింటివాళ్లు కట్నకానుకలు, సారె కింద ఇచ్చే వాటికంటే ఈ విందులో వడ్డించే వెరైటీల ఖర్చు అనేక రెట్లు ఎక్కువైంది. తక్కువలో తక్కువ మూడున్నర నుంచి నాలుగున్నర లక్షల వరకు ఖర్చువుతుంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఖర్చు భారంగా ఉందని పేద, సామాన్య ముస్లిం కుటుంబాల నుంచి మతపెద్దలకు ఫిర్యాదులు అందాయి. దీంతో కరోనా పరిస్థితుల్లో వివాహవిందులో ఆడపిల్లల కుటుంబాలపై భారం పడకుండా ఓ నిర్ణయం తీసుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ముస్లిం మతపెద్దలు. ఇకపై ఏ పెళ్లి అయినా ఒకటే కూర, ఒకటే స్వీటు  ఉండాలని తీర్మానం చేశారు. వివాహంలో పెరుగుతున్న విందు ఖర్చు తగ్గించేందుకు ఈ మధ్య వేములవాడలోని ఓ షాదీఖానాలో 8 మజీద్ కమిటీల పెద్దలు సమావేశమయ్యారు. స్థానిక విందుల్లో భగారాతో పాటు ఒకటే కూర చికెన్ లేదా మటన్ మాత్రమే పెట్టాలని నిర్ణయించారు. ఏదైనా ఒకటే స్వీటు పెట్టాలని తీర్మానించారు. వేములవాడకు చెందిన ముస్లిం మత పెద్దలు చేసిన ఈ తీర్మానం వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానుంది.

మరిన్ని వార్తల కోసం..

మహా నటి హీరోకు కరోనా పాజిటివ్

భారత్ సాయంతో మారిషస్లో చేపట్టిన ప్రాజెక్టుల ఓపెనింగ్

కరోనా టెస్టు రేట్లు తగ్గించిన మరో రాష్ట్రం