ఏపీ సర్కారు బాటలో మరో రాష్ట్రం నిర్ణయం

ఏపీ సర్కారు బాటలో మరో రాష్ట్రం నిర్ణయం

దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కరోనా టెస్టుల సంఖ్య మరింత పెంచాలని కేంద్రం సూచించింది. ఆస్పత్రులపై కేసుల భారం ఒక్కసారిగా పెరిగిపోకుండా చూడాలంటే టెస్టింగ్, ట్రేసింగ్ కీలకమని, ఈ విషయంలో అలసత్వం వద్దని ఆదేశించింది. ఈ క్రమంలో కరోనా టెస్టులు సామాన్యులకు భారం కాకుండా ఉండేందుకు ఒక్కో రాష్ట్రం నిర్ణయం తీసుకుంటున్నాయి. 

ఇప్పటికే ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్టుల రేట్లను తగ్గిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్ టెస్టులను ప్రైవేట్ ల్యాబ్స్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.350కే చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా జార్ఖండ్ ప్రభుత్వం కూడా అదే బాటలో నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్ టెస్టులను ప్రస్తుతం ఉన్న రూ.400 నుంచి రూ.300కు తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇంటి వెళ్లి శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేస్తే రూ.400 తీసుకోవచ్చని పేర్కొంది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు రేటును రూ.150 నుంచి రూ.50కి తగ్గించింది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని జార్ఖండ్ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం..

ఉద్యోగులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించండి

గర్భవతి అని చూడకుండా మహిళా ఫారెస్ట్ రేంజర్పై మాజీ సర్పంచ్ దాడి

ఐదు రాష్ట్రాల్లోనూ గెలిచేది బీజేపీనే