అభివృద్ధికే ప్రజలు పట్టం కడతరు

అభివృద్ధికే ప్రజలు పట్టం కడతరు

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. అన్ని పార్టీలూ గెలుపు కోసం కసరత్తులు మొదలుపెట్టాయి. ఫిబ్రవరి 10 నుంచి మొదలై మొత్తం ఏడు దశల్లో యూపీ, మణిపూర్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ల్లో జరగనున్న ఎన్నికల్లో మెజారిటీ రాష్ట్రాలను కైవసం చేసుకోవడం ద్వారా తమ పట్టునిలుపుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయతే ఇప్పుడు ఎన్నికలు జరగబోయే ఏ ఒక్క రాష్ట్రంలోనూ మరో పార్టీ ఏదీ గెలవబోదని హర్యానా మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనీల్ విజ్ జోష్యం చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మాత్రమే గెలవబోతోందని అన్నారు.

గతంలో ఒకరు వచ్చి గరీబీ హఠావో అన్న నినాదంతో వచ్చి ఎన్నికల్లో విజయం సాధించారని, ఆ తర్వాత మరొకరు వచ్చి తన తల్లి మరణించిందని ఓట్లు వేయాలని కోరి గెలిచారంటూ కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు చేశారు అనీల్ విజ్. ఇప్పడు అలాంటి రాజకీయాలకు రోజులు ముగిశాయని, అభివృద్ధి రాజకీయాలకు మాత్రమే స్థానం ఉందని ఆయన అన్నారు. దేశంలో అభివృద్ధి చేసి చూపించి తమ పార్టీ ఓట్లు అడుగుతోందని, మోడీ నాయకత్వంలోని తమ పార్టీకి ప్రజలు పట్టం కడుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

పోడు భూములపై ప్రకటనలే తప్ప పరిష్కారం లేదు

పాకిస్థాన్లో బాంబు పేలుడు

సైంటిఫిక్ డేటా ఆధారంగా 15 ఏళ్లలోపు పిల్లలకు టీకా!