పాకిస్థాన్లో బాంబు పేలుడు

పాకిస్థాన్లో బాంబు పేలుడు

లాహోర్ : పాకిస్థాన్లో  భారీ పేలుడు సంభవించింది. లాహోర్లోని అనార్కలీ మార్కెట్లో బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు చనిపోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారతీయ వస్తువులు అమ్మే పాన్ మండి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు, షాపుల అద్దాలు పగిలిపోయాయి. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ ఘటనకు బాధ్యత వహించలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుకు ఏ పదార్థాలు ఉపయోగించారన్నది విశ్లేషిస్తున్నారు. బైక్లో టైమర్ బాంబు అమర్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పేలుడులో గాయపడిన వారిని మయో హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పలు వాహనాలతో పాటు షాపులు ధ్వంసమయ్యాయి. పేలుడు అనంతరం అనర్కలీ మార్కెట్ను మూసివేశారు.

For more news..

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే

సైంటిఫిక్ డేటా ఆధారంగా 15 ఏళ్లలోపు పిల్లలకు టీకా!