మహా నటి హీరోకు కరోనా పాజిటివ్
V6 Velugu Posted on Jan 20, 2022
మళయాళీ యువ నటుడు, తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడైన దుల్కర్ సల్మాన్ కు కరోనా సోకింది. తన తండ్రి.. సీనియర్ నటుడు మమ్ముట్టి కరోనా బారిన పడడంతో.. ఆయన కూడా అనుమానంతో పరీక్షలు చేయించుకోగా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలే ఉన్నాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెండు రోజుల క్రితం తన తండ్రి, సీనియర్ నటుడు మమ్ముట్టి కరోనా సోకడంతో హోం ఐసొలేషన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.
Positive. pic.twitter.com/cv3OkQXybs
— Dulquer Salmaan (@dulQuer) January 20, 2022
మళయాళ సినీ పరిశ్రమలో రాణిస్తున్న యువ హీరో దుల్కర్ సల్మాన్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. తెలుగులో సీనియర్ నటి, దివంగత సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘మహానటి’ సినిమా సూపర్ హిట్ కావడంతో దుల్కర్ సల్మాన్ నటించిన మళయాళీ సినిమాలన్నీ తెలుగులో డబ్బింగ్ అవుతున్నాయి. మాతృభాషతోపాటు.. ఇతర భాషల్లో కూడా గుర్తింపు రావడంతో దుల్కర్ సల్మాన్ చేతి నిండా సినిమాలతో బిజీగా మారారు. కరోనా మళ్లీ విజృంభించడంతో తాజాగా కరోనా బారిన పడ్డారు. తన తండ్రి బాటలోనే హోం ఐసొలేషన్ లోకి వెళుతున్నట్లు దుల్కర్ సల్మాన్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా మెలగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని దుల్కర్ సల్మాన్ కోరారు. ఒకవేళ కరోనా సోకకపోయినా.. లక్షణాలు కనిపించకున్నా ఏ మాత్రం అజాగ్రత్త వహించవద్దని ఆయన హెచ్చరించారు. కరోనా సోకని వారు కూడా మహమ్మారి ఇంకా పోలేదని గుర్తుంచుకోవాలని.. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. వైద్య నిపుణుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా మెలగాలని దుల్కర్ సల్మాన్ కోరారు.
మరిన్ని వార్తల కోసం..
భారత్ సాయంతో మారిషస్లో చేపట్టిన ప్రాజెక్టుల ఓపెనింగ్
వీగన్స్ కోసం స్పెషల్ చికెన్ 65, సలాడ్స్
కరోనా టెస్టు రేట్లను తగ్గించిన మరో రాష్ట్రం
Tagged corona vaccine, Covid-19, Corona Positive, Corona test, Dulquer Salmaan