CAAపై ముస్లింల ర్యాలీ: స్టీరింగ్ తమ చేతిలో ఉందంటూ కేసీఆర్ పై కామెంట్స్

CAAపై ముస్లింల ర్యాలీ: స్టీరింగ్ తమ చేతిలో ఉందంటూ కేసీఆర్ పై కామెంట్స్

స్టీరింగ్ మీ చేతిలోనే ఉన్నా.. కారు తప్పుడు రూట్ లో ఎందుకు వెళ్తుంది.. అని ఓ ముస్లిం యువకుడు ఫ్లకార్డును ప్రదర్శించాడు. శుక్రవారం CAA, NRC లకు వ్యతిరేకంగా ముస్లిం జేఏసీ హైదరాబాద్ లో ర్యాలీ తీసింది. ఈ ర్యాలీలో ఓ ముస్లిం యువకుడు పట్టుకున్న ఫ్లకార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారు స్టీరింగ్ మా చేతిలో ఉందని.. కారు మాత్రం తప్పుడు రూట్ లో వెళ్తుందని ఫ్లకార్డు ప్రదర్శించాడు. అయితే ఆకారు తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీ గుర్తు. దీంతో పాటు..  TRS పార్టీ జెండా కూడా కారుపై ఉంది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి…  MIM లీడర్ అసదుద్ధీన్ ఓవైసీ, TRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను, తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేసి ఈ ప్రశ్నకు మీరు సమాదానం చెప్తారా అని ప్రశ్నించాడు మరో ముస్లిం యువకుడు. 

ఈ ర్యాలీలోనే మరో ఫ్లెక్సీ వైరల్ అయింది. ఇందులో.. సీదా.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్రించారు ముస్లిం యువకులు.. నీరక్తం ఎప్పుడు మరుగుతది కేసీఆర్… నోరుతెరువు, సమాదానం చెప్పు CAA, NRCలకు వ్యతిరేకం అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫొటోతో పాటు మహాత్మాగాంధీ ఫొటోకూడా కేసీఆర్ ఫొటో పక్కనే ఉంది.