శ్రీరాముడికి ముస్లిం మహిళ పట్టు వస్త్రాల సమర్పణ

శ్రీరాముడికి ముస్లిం మహిళ పట్టు వస్త్రాల సమర్పణ


జమ్మికుంట, వెలుగు: సీతారామచంద్రస్వామిపై ఉన్న అపార భక్తితో ఓ ముస్లిం మహిళ శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించి మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో జరుగుతున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణానికి చెందిన అబేధా బాను ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు తయారు చేసి తలంబ్రాలతో కలిసి ఆలయ అధికారులకు అందజేశారు. సీతారామచంద్రస్వామిపై ఉన్న భక్తితో ఈ పట్టు వస్త్రాలు సమర్పించానని, అవకాశం ఇస్తే ప్రతీ సంవత్సరం సమర్పిస్తానని ఆమె తెలిపారు. ముస్లిం మహిళ ఇలా పట్టు వస్త్రాలు సమర్పించడం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని పలువురు  ప్రశంసించారు.