మలక్ పేట, వెలుగు : 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ భారీ సంఖ్యలో ముస్లిం మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు . శుక్రవారం సాయంత్రం దర్గా జిహాద్ ఓ షహ్‌దాత్‌కు చెందిన మహిళలు సైదాబాద్ ఉజలేష ఈద్గా గ్రౌండ్స్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తర్వాత డిసెంబర్ 6 బ్లాక్ డే అంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది బాలికలు, మహిళలు పాల్గొన్నారు.
