శ్రియాతో కలిసి డ్యాన్స్‌, యోగా చేసే అవకాశం

శ్రియాతో కలిసి డ్యాన్స్‌, యోగా చేసే అవకాశం
  • రూ.200 డొనేట్‌ చేయడం ద్వారా..
  • లక్కీ వినర్స్‌తో వీడియో కాల్‌ ద్వారా డ్యాన్స్‌
  •  చారిటీ కోసం ఫండ్స్‌ కలెక్ట్‌ చేస్తున్న నటి

చెన్నై: టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రియ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. ‘ది కైండ్‌నెస్‌ ఫౌండేషన్‌’, చెన్నై టాస్క్‌ ఫోర్స్‌తో కలిసి నిరాశ్రయులైన ముసలివాల్లు, రోజువారి కూలీలు, అనాథలు, వికలాంగుల కోసం ఫండ్స్‌ కలెక్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.200 చెల్లిస్తే లక్కీ డ్రాలో ఎంపికైన ఇద్దరు విన్నర్స్‌ వీడియో కాల్‌లో తనతో కలిసి డ్యాన్స్‌, యోగా చేయొచ్చని శ్రియ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. www.thekindnessproject.in లో రూ.200 చెల్లించి దాని రసీదును ఈమెయిల్‌ చేస్తే చెల్లించిన వారికి లక్కీ డ్రా తీసి ఇద్దరు విజేతలను ప్రకటిస్తారు. ఆ ఇద్దరు వీడియో కాల్‌ ద్వారా శ్రియతో డ్యాన్స్‌, యోగా చెయొచ్చు. శనివారం వరకు డొనేట్‌ చేయొచ్చు, ఆదివారం విజేతలను ప్రకటిస్తారు. “ కొవిడ్‌ బాధితుల కోసం ఫండ్స్‌ కలెక్ట్‌ చేస్తున్నాను. మనమంతా మంచి కోసం చేతులు కలుపుదాం. విజేతలు నాతో యోగా, డ్యాన్స్‌ చెయొచ్చు” అని శ్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం శ్రియ తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో ఉంటున్నారు.