షేర్​ చేయాలి.. ఎక్కువ లైక్​లు కొట్టాలె

షేర్​ చేయాలి.. ఎక్కువ లైక్​లు కొట్టాలె
  • మంచి కామెంట్లు పెడితే సీఎం, కేటీఆర్​మాట్లాడుతరు
  • టీఆర్ఎస్​ సోషల్​మీడియా స్టేట్​ కన్వీనర్​ దినేశ్ చౌదరి

యాదాద్రి, వెలుగు : ‘సోషల్​మీడియాను ఉపయోగించుకోవడంలో మనం వెనుకబడ్డాం. మన లీడర్ల స్పీచ్​తో పాటు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత స్పీచ్​కు తక్కువ లైక్​లు వస్తున్నయ్. దీన్ని మెరుగుపర్చుకోవాలె’ అని టీఆర్ఎస్​ సోషల్​మీడియా స్టేట్​ కన్వీనర్​ దినేశ్​ చౌదరి అన్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో టీఆర్ఎస్ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగం కార్యకర్తలతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతపై కొన్ని పత్రికల్లో వచ్చిన న్యూస్​ క్లిప్పింగ్​లను..దాని కింద ఉన్న లైక్​లను చూపిస్తూ ఇంత తక్కువ రావడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటి నుంచి అందరూ ఎమ్మెల్యే సునీత సహా టీఆర్​ఎస్​పార్టీ లీడర్ల స్పీచ్​ను సోషల్​మీడియాలో అప్​లోడ్​ చేయడంతో పాటు షేర్​ చేస్తూ ఎక్కువగా లైక్​లు కొట్టాలని సూచించారు.

సోషల్​మీడియాలో మంచి కామెంట్లు చేసిన కార్యకర్తలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ నేరుగా ఫోన్​లో మాట్లాడుతారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్​ లీడర్ల కామెంట్లకు వెంటనే కౌంటర్​ ఇవ్వాలన్నారు.  ప్రజలకు అన్నీ చేస్తున్నా సోషల్ మీడియాను వాడుకోవడంలో వెనకబడ్డామని ఎమ్మెల్యే సునీత, డీసీసీబీ చైర్మన్​ గొంగిడి మహేందర్​రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ ఉన్నారు.