ఈ టెక్నిక్ తో ఇంట్లోని ఫోన్లన్నీ పక్కని అందరూ కలిసి భోజనం చేయొచ్చు

ఈ టెక్నిక్ తో ఇంట్లోని ఫోన్లన్నీ పక్కని అందరూ కలిసి భోజనం చేయొచ్చు

కలిసి తినే కుటుంబం, ఎప్పటికీ కలిసే ఉంటుంది' అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా భారతీయ కుటుంబాలలో కలిసి భోజనం చేయడం అనేది సంప్రదాయమైన పద్దతుల్లో ఒకటి. ఈ రోజుల్లో పిల్లలు.. స్మార్ట్‌ఫోన్‌లతో ఎక్కువ సమయం గడుపుతూ కాలక్షేపం చేయడం చూస్తూనే ఉంటాం. యూట్యూబ్ వీడియోలు చూడటం లేదా గేమ్‌లు ఆడడంతో స్నేహితులతో గడిపే సమయం కూడా తగ్గిపోతుంది. అంతే కాదు కుటుంబసభ్యులతో సంభాషించే సమయం కూడా తగ్గుతుంది. కలిసి ఉండే సమయాన్ని కూడా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లే ఆక్రమిస్తున్నాయి.

ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి ఓ తల్లి 'టెక్నిక్'ని యూజ్ చేస్తుంది. కుటుంబంలోని ప్రతి సభ్యుడు డిన్నర్ ప్లేట్‌ను అందించడానికి ముందు వారి స్మార్ట్‌ఫోన్‌లు లేదా ల్యాప్‌టాప్‌ల వంటి గాడ్జెట్‌లను టేబుల్‌పై ఉంచి, భోజనం తీసుకుని వెళ్తుంటారు. ప్రస్తుత జనరేషన్ లో ఈ ఉపాయం ఇతర తల్లులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రశాంతమైన కుటుంబ విందు పొందటానికి దీన్ని అమలు చేయవచ్చని పలువురు సూచిస్తున్నారు.

ఈ వీడియోకు ఇప్పటివరకు 1లక్షకు పైగా వ్యూస్ రాగా.. కామెంట్లు కూడా అదే స్థాయిలో వచ్చి పడ్డాయి. చాలా మంది నెటిజన్లు తమ కుటుంబాల్లో ఈ ట్రిక్‌ని ఎలా ట్రై చేస్తారో కామెంట్ బాక్స్ లలో రాసుకువచ్చారు. మరికొందరు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఇవ్వకూడదని సూచించారు.

https://twitter.com/pb3060/status/1658671809145999360