Good Health : మంచి ఆరోగ్యానికి ఆవాకు

Good Health : మంచి ఆరోగ్యానికి ఆవాకు

ఆవ, పాలకూర, తోట కూర ఆకులతో చేసే 'సర్సోంకా సాగ్'ను చలికాలంలో ఎక్కువమంది తింటారు. జీలకర్ర, అల్లం, పసుపు, వాము, ధనియాలతో చేసే ఈ రెసిపీని చలికాలంలో తింటే ఆరోగ్యానికి వెచ్చటి బలం ఇచ్చినట్టే. 

* జీలకర్ర జీర్ణ వ్యవస్థను బాగు చేస్తుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ నుంచి కాపాడుతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మలబద్ధకం నుంచి బయటపడేస్తుంది. యూరినేషన్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. ఇందులో యాంటీ బయాటిక్ గుణాలున్నాయి. 

* వంటకు మంచి సువాసన, రుచిని ఇవ్వడమే. కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వల్ల పేగు సమస్యలు, కడుపులో మంట వంటివి పోతాయి. కడుపు లోపలి పొరను అల్లం కాపాడుతుంది. ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి తగ్గుతాయి. జీర్ణక్రియకు కావాల్సిన ఎంజైమ్స్ ని అల్లం పెంచుతుంది. 

* పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కుర్కుమిన్ ఉంటుంది. ఇది కడుపులోని గ్యాసన్ ని తొలగిస్తుంది. పేగు సమస్యలను తగ్గిస్తుంది. సాగ్ రెసిపీలో కలిపే ధనియాల పేస్ట్ మంచి సువాసన ఇస్తుంది. ధనియాల్లో పీచు గుణాలు ఎక్కువ. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 

* చలికాలంలో చాలామంది వాము తింటుంటారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే. కాకుండా జీర్ణక్రియకు సాయపడుతుంది.

* వాములో ఫైబర్ కూడా పుష్కలం.