కుంటాల, వెలుగు: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించి, మద్దతు ధర పొందాలని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. కుంటాల మండలంలోని కల్లూర్, కుంటాల, అందకుర్, ఓల, లింబా(కె), అంబకంటి గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయా సెంటర్లలో సౌకర్యాలను పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. సారంగాపూర్ ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హాది, పీఏసీఎస్చైర్మన్సట్ల గజ్జరాం, తహసీల్దార్ కమల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నాభావు సాఠే అడుగుజాడల్లో నడవాలి
భైంసా, వెలుగు: సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ సూచించారు. శుక్రవారం భైంసాలో సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన బోధనలు పేద, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు.
చదువుతోనే అన్ని రంగాల్లో ముందుంటారని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విగ్రహ కమిటీ సభ్యులను అభినందించారు. అన్నాభావు సాఠేకు భారతరత్న ప్రకటించేలా తన వంతు కృషి చేస్తానన్నారు. విగ్రహావిష్కరణకు నియోజకవర్గంలోని పలు గ్రామాలు నుంచి ప్రజలు తరలివచ్చారు. ఏఎంసీ చైర్మన్ఆనంద్ రావు పటేల్, బీజేపీ నాయకుడు మోహన్రావు పటేల్, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
