
గడచిన కొన్ని నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ డబ్బును వెనక్కి తీసుకుంటుంటే.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు అలాగే రిటైల్ పెట్టుబడిదారులు దానిని భర్తీ చేస్తున్నట్లు ఇటీవలి రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే అసలు ఎవరు ఈ దేశీయ పెట్టుబడిదారులు అంటే ఎవరెవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో తమ డబ్బును సేవ్ చేస్తున్నవారే. ప్రధానంగా నగరాల్లో ఉన్న ప్రజలు ఎక్కువ మెుత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు గుర్తించబడింది. ఇదే క్రమంలో చిన్న పట్టణాలు, నాన్ మెట్రో నగరాల నుంచి కూడా పెట్టుబడిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే ప్రతి నలుగురిలో ఒక మహిళా ఇన్వెస్టర్ ఉంటున్నారు.
దేశంలోని మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్టిట్యూషనల్ పెట్టుబడిదారులు, బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ఎల్ఐసీ వంటి సంస్థలు ఎగ్జిట్ అవుతున్న విదేశీ ఇన్వెస్టర్ల స్థానంలో పెట్టుబడులు పెడుతున్నాయి. పైగా కోట్ల మంది చిన్న పెద్ద పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఆ మెుత్తాలను ఈక్విటీ మార్కెట్లలోకి తీసుకురావటం గేమ్ చేంజర్‌గా మారాయని వెల్లడైంది. ప్రధానంగా ఎస్ఐపీ రూపంలో పెట్టుబడులు పెడుతున్న భారతీయుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుండటం.. అభివృద్ధి చెందుతున్న భారత ఈక్విటీ మార్కెట్లలో డబ్బు కుమ్మరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇది మార్కెట్ల స్థిరత్వాన్ని నిర్థారించటానికి అలాగే ఎక్కువగా విదేశీ పెట్టుబడిదారులపై ఆధారపడటాన్ని తగ్గించటానికి ఎంతగానో ఉపయోగపడుతోంది.
2020-21లో ఎస్ఐపీ ఇన్వెస్టర్ల సంఖ్య కోటి 41 లక్షల నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 6కోట్ల 80 లక్షలకు పెరిగింది. ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్ సంస్థల అసెంట్స్ అండర్ మేనేజ్మెంట్ విలువ రూ.4.27 ట్రిలయన్ నుంచి ప్రస్తుతం రూ.13.35 ట్రిలియన్లకు చేరుకుంది.