ఖమ్మం  కలెక్టర్ గా ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం  కలెక్టర్ గా ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం, వెలుగు : ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ముజామ్మిల్ ఖాన్ ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017కు బ్యాచ్ కు చెందిన ముజామ్మిల్ ఖాన్ ఇప్పటి వరకు పెద్దపల్లి కలెక్టర్ గా పని  చేశారు.

ముజామ్మిల్ ఖాన్ తండ్రి ఏకే ఖాన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ గా పనిచేశారు. అయితే ప్రస్తుత కలెక్టర్ వీపీ గౌతమ్ కు ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.