కన్యాదానమంటే, కూతుర్ని దానమివ్వడమని అర్ధం. నా కూతురేం ఆస్తి కాదు. నేను ఈ ఆచారాన్ని పాటించడం లేదు.ఇది ప్రొగ్రెసివ్ థాట్, 'ఆ తండ్రి ఆలోచన గొప్పది' ఇలా పెళ్లి చేయడం సాహసమే అనే కామెంట్స్ వచ్చాయి. కాని ఆ కూతురి కన్యాదానం తల్లి చేసింది.
ఈ కన్యాదానం.. అమ్మ చేసింది
కన్యాదానం మామూలుగా తండ్రి చేస్తాడు. లేదంటే పెదనాన్న, అన్న, మేనమామ.. ఇలా ఆ ఇంటి మగవాళ్లు చేస్తారు. చెన్నైలో ఈమద్యే తన కూతుర్ని, ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసిన రాజేశ్వరి కన్య అనే ఒక సింగిల్ మదర్, తనే స్వయంగా కన్యాదానం చేసింది. ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
అసలు కన్యాదానం అంటే అర్ధం తెలుసుకోండి. ఆడపిల్ల ప్రాపర్టీ అని ఎవరు చెప్పారు మీకు?"అలాంటప్పుడు హిందూ సంప్రదాయంలో పెళ్లెందుకు చేసుకోవాలి? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా!..నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే మా బాధ్యత తీరుతుంది.ఈ మాటను చాలా సినిమాల్లోనే ఉంటారు.
పాతికేళ్ల వయసున్న అమ్మాయి ఉన్న ఇంట్లో కూడా ఇలాంటి మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఒక అయ్య చేతి లో పెట్టడమే 'కన్యాదానం! తాళి కడితే పెళ్లవుతుంది. అమ్మాయి అత్త గారింటికి వెళ్లిపోతుంది. అప్పటినుంచి ఆ అమ్మాయి బాధ్యత అంతా పెళ్లి చేసుకున్న అబ్బాయిదే. అంతకుముందు అదంతా అమ్మాయి తండ్రిది. పెళ్లి రోజు అబ్బాయి కాళ్లు కడిగి, తన కూతుర్ని అతడి చేతుల్లో పెట్టి, నా కూతురు బాధ్యత ఇంకా నీదే" అని చెప్తాడు తండ్రి. ఇది మన పెళ్లిళ్లలో కనిపించే కంటతడి పెట్టించే దృశ్యం. అన్ని సంవత్సరాలు తండ్రి దగ్గర 'నాన్న ఉన్నాడు' అని ఎంతో భరోసాగా పెరిగిన అమ్మాయి. ఇప్పుడు నాకు భర్త ఉన్నాడు. అని కొత్త జీవితానికి స్వాగతం చెప్పాలి. ఇదే కన్యాదానం.
ఇదంతా పెద్ద కథ సనాతన హిందూ సంప్రదాయం పాటిస్తున్న ఆచారం. తాజాగా నా కూతురు ఆస్తి కాదు. నేను కన్యా దానం చేయను' అని కోలకతాలో ఒక తండ్రి చెప్పిన మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈయన హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతున్న తన కూతురు పెళ్లిలో, అందరిలా తాను కన్యాదానం చేయనని తేల్చి చెప్పాడు. "కన్యాదానమంటే కూతుర్ని దానమివ్వడమని అర్థం. నా కూతురేం ఆస్తి కాదు. నేను ఈ ఆచారాన్ని పాటించడం లేదు" అని పెళ్లి జరుగుతున్న సమయంలో చిన్న ప్రసంగం ఇచ్చాడు. ఈ పెళ్లి జరిపిన పండితులు కూడా అడవాళ్లే కావడం విశేషం.
ట్విటర్లో అస్మిత బనేరచయిత్రి ఈ పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ ఇది నాకు బాగా నచ్చింది' అని చెప్పింది.
కన్యాదానమనే ఆచారాన్ని పక్కన పెట్టిన ఆ తండ్రిని పొగుడుతూ ట్విటర్లో చాలా కామెంట్స్ వచ్చాయి. ఇది ప్టోగ్రెసివ్ టి'. తండ్రి ఆలోచన గొప్పది', 'ఇలా పెళ్లి చేయడం సాహసమే అనే కామెంట్స్ వచ్చాయి.
అయితే, సరిగ్గా ఈ కామెంట్లకు తోడగానే, 'అసలు కన్యాదానం అంటే అర్ధం తెలుసుకోం డి. ఆడపిల్ల ప్రాపర్టీ అని ఎవరు చెప్పారు. మీకు.. అలాంటప్పుడు హిందూ సంప్రదా యంలో పెళ్లెందుకు చేసుకోవాలి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా!.. ఇలాంటి కామెంట్స్ కూడా ఉన్నాయి.
–వెలుగు,లైఫ్–
