కల్తీ పాలను గుర్తించడం ఎలా?... సింపుల్ చిట్కాలు ఇవిగో

కల్తీ పాలను గుర్తించడం ఎలా?... సింపుల్ చిట్కాలు ఇవిగో

కొంతమంది వ్యాపారులు లాభం కోసం పాలలో నీళ్లే కాదు, అవి చిక్కగా ఉన్నాయని చూపించడానికి హానికరమైన పదార్థాలను కలుపుతారని కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. ఈ ఘటనలతో పాల కల్తీ వ్యాపారం ప్రజల్లో భయాందోళనకు దారి తీస్తుంది. ఆరోగ్యానికి మంచివని భావించే పాలు తీరా మన చేతికి వచ్చేసరికి ఎంత  నాణ్యతతో ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తున్నాయి. పాల కల్తీ చాలా రకాలుగా జరుగుతుందని.. కొన్ని సాధారణ పరీక్షలతో ఎవరైనా గుర్తించవచ్చు. పాలలో కల్తీ ఉందా అని ఇంట్లో కొన్ని చిట్కాలతో మనం చెక్ చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.. 

నీరు కలిపారా ? లేదా? తెలుసుకునేందుకు.. 

కొద్దిగా పాలను ప్లేట్ లేదా టైల్స్‌పై పోసి పరీక్షించాలి స్వచ్ఛమైన పాలు అయితే మందంగా, నెమ్మదిగా ప్రవహిస్తాయి. నీరు కలిసిన పాలు చాలా త్వరగా జారిపోతాయి.

డిటర్జెంట్ కలిపారా అని డౌట్ ఉంటే.. 

బాటిల్‌లో కొంత పాలను తీసుకుని తక్కువ నీటితో షేక్ చేసి చూడాలి. స్వచ్ఛమైన పాలు పలుచగా, తక్కువ నురుగు వస్తాయి. డిటర్జెంట్ కలిసిన పాలు గట్టి నురుగు ఎక్కువసేపు ఉంటుంది.

స్టార్చ్‌ కలిపిన కల్తీ పాలయితే..

కొద్దిగా పాలలో అయోడిన్ రెండు చుక్కలు వేసి గమనిస్తే, స్వచ్ఛమైన పాలు రంగు మారవు. కానీ స్టార్చ్ కలిసిన పాలు నీలం లేదా నలుపు రంగులో మారతాయి.

యూరియా కలిసిందా? అని డౌట్ వస్తే..

కొద్దిగా పాలలో సోయాబీన్ పొడి కలిపి చూసినప్పుడు, స్వచ్ఛమైన పాలు వాసనలో మార్పు ఉండదు. కానీ యూరియా కలిసిన పాలు అమోనియా వాసన వస్తుంది.

సింథటిక్ పాలను గుర్తించాలంటే..

అరచేతితో పాలను రుద్దినప్పుడు, స్వచ్ఛమైన పాలు మృదువుగా, సహజంగా ఉంటాయి. సింథటిక్ లేదా కల్తీ పాలు సబ్బులా జారుడు, అసహజ ఫీలింగ్ కలుగుతుంది. 
ఇలా చెక్ చేసి పాలు కల్తీ అని ప్రాథమిక నిర్ధారణకు రావొచ్చు. అయితే ఖచ్చితమైన నిర్దారణకోసం ల్యాబ్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.