
మెల్‌బోర్న్: ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలవడంలో తాను కీలక పాత్ర పోషించాలని ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లైయన్ అన్నాడు. ఇది తన లాంగ్ టైమ్ గోల్ అని చెప్పాడు. 2017లో చివరిసారి ఇండియాలో పర్యటించిన ఆసీస్.. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్‌లో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆ స్లాట్‌ను టీ20 వరల్డ్‌కప్ కోసం ఉపయోగించుకున్నారు. దీంతో ఆసీస్‌కు ఇండియాలో ఆడే చాన్స్ 2023లో దక్కుతుంది. ప్రస్తుతం 34 ఏళ్ల వయసులో ఉన్న లైయన్.. అప్పటివరకు టీమ్‌లో ఉంటాడో లేదో చూడాలి. ఇక వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరిగే యాషెస్ సిరీస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని లైయన్ చెప్పాడు.