ఆదిపురుష్ రైటర్ కు పోలీస్ సెక్యూరిటీ

ఆదిపురుష్ రైటర్ కు పోలీస్ సెక్యూరిటీ

తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆదిపురుష్ సినిమా రైటర్ మనోజ్ శుక్లా. సినిమాలో కొన్ని డైలాగ్స్ పై అభ్యంతరం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సినిమాను బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే తనకు ప్రాణహాని ఉందని.. తనను రక్షించాలంటూ పోలీసులను కోరాడు చిత్ర రచయిత మనోజ్ శుక్లా. దీనిపై స్పందించిన పోలీసు అధికారులు మనోజ్ కు భద్రతను కల్పించారు. పరిస్థితిని తాము పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడుగా చేసిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి షో నుండే ఈ సినిమాకు మిక్సుడ్ టాక్ వచ్చింది. సినిమాలో డైలాగ్స్ పట్ల, పాత్రలను మలిచిన తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినా కూడా ఈ సినిమా కలెక్షన్స్ బాగానే రాబడుతోంది. మొదటి రోజు రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. కేవలం మూడు రోజుల్లోనే రూ. 340 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.