మా మైండ్ గేమ్స్ పనిచేస్తున్నయ్! : విదేశాంగ మంత్రి జైశంకర్

మా మైండ్ గేమ్స్ పనిచేస్తున్నయ్! : విదేశాంగ మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ:  రష్యాతో ఇండియా సంబంధాలు స్థిరంగా, ప్రయోజన కరంగా ఉన్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఇతర దేశాలతో వ్యవహారాల్లో ఆలోచనాత్మకంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. "రష్యాతో సంబంధాలు మాకు ముఖ్యం. విమర్శకులు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారంటే..మా మైండ్ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పనిచేస్తున్నాయని అర్థం. వారు ఏమైనా అనుకోవచ్చు. కానీ మా విధానం మాత్రం స్థిరమైనది. రష్యాతో  రిలేషన్స్  కొనసాగిస్తూనే ఉంటం" అని  జైశంకర్ పేర్కొన్నారు.

క్రాస్ బార్డర్ టెర్రరిజమే పాకిస్తాన్ ప్రధాన విధానమని ఆయన ఆరోపించారు.  అందులోకి భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  లాగేందుకు పాక్ చాలా ప్రయత్నించిందని, కానీ అది జరగలేదని తెలిపారు. సోమవారం ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. టెర్రర్ కార్యకలాపాలకు మద్దతిస్తున్నంత కాలం పాక్ తో చర్చల ప్రసక్తే లేదన్నారు.కెనడా రాజకీయాలు ఖలిస్తానీ వంటి హానికర శక్తులకు ప్రాధాన్యత ఇచ్చాయని విమర్శించారు.