ఓటర్ల జాబితాలో నా పేరు లేదు.. బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి ఆరోపణ

ఓటర్ల జాబితాలో నా పేరు లేదు.. బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి ఆరోపణ

పాట్నా: బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టి ముసాయిదా ఓటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ప్రచురించగా, అందులో తన పేరు లేదని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ తెలిపారు. శనివారం పాట్నాలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో తన ఎపిక్‌‌‌‌‌‌‌‌ ఐడీతో సెర్చ్‌‌‌‌‌‌‌‌ చేయగా ఎలాంటి వివరాలు రాలేదు. 

‘‘చూడండి.. ముసాయిదా ఓటర్ల జాబితాలో నా పేరు లేదు. ఇప్పుడు నేను ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి? మా ఇంటికి వచ్చిన బీఎల్‌‌‌‌‌‌‌‌వోకు నేనే స్వయంగా ఫామ్ నింపి ఇచ్చాను. అయినప్పటికీ జాబితాలో నా పేరు లేదు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ దంపతుల పేర్లు కూడా మిస్ అయ్యాయని నా దృష్టికి వచ్చింది” అని తేజస్వీ యాదవ్ చెప్పారు. అయితే జాబితాలో తేజస్వీ యాదవ్ పేరు ఉందని ఇటు బీజేపీ నేతలు, అటు అధికారులు క్లారిటీ ఇచ్చారు. 

‘‘ఓటర్ల జాబితాలో తేజస్వీ పేరు చాలా స్పష్టంగా ఉంది. ఆయన తండ్రి లాలూప్రసాద్ యాదవ్ పేరు దగ్గరే ఉంది. ఓటర్ల జాబితాలో పేరు సెర్చ్ చేసుకోవడం కూడా తేజస్వీ యాదవ్‌‌‌‌‌‌‌‌కు రాదు. ఇక ఆయన అబద్ధాల దుకాణం బంజేసుకుంటే మంచిది” అని డిప్యూటీ సీఎం సమ్రాట్‌‌‌‌‌‌‌‌ చౌధరి కౌంటర్ ఇచ్చారు. జాబితాలో తేజస్వీ యాదవ్ పేరు ఉన్న పార్ట్‌‌‌‌‌‌‌‌ను ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ‘‘ఓటర్ల జాబితాలో తేజస్వీ పేరు ఉంది. పోలింగ్ బూత్‌‌‌‌‌‌‌‌ మారలేదు. కేవలం సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ మాత్రం మారాయి” అని అధికారులు తెలిపారు.