యువత ఉపాధి లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్డ్స్ ట్రైనింగ్ సెంటర్లు (ATC) : మంత్రి వివేక్ వెంకటస్వామి

యువత ఉపాధి లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్డ్స్ ట్రైనింగ్ సెంటర్లు (ATC) : మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: కార్మిక శాఖ మంత్రిగా మా నాన్న కాకకు దేశంలోనే ఎంతో గుర్తింపు ఉందని.. మా నాన్న  లాగానే గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కోరిక అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. 2026, జూన్ 8వ తేదీతో రాష్ట్ర కార్మిక మంత్రిగా వివేక్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‎లో ఆయన  మీడియాతో మాట్లాడారు. గిగ్ వర్కర్ల కోసం చట్టం తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. 

రాహుల్ గాంధీ హామీ ప్రకారం గిగ్ వర్కర్లకు చట్టపరమైన భద్రత కల్పించామన్నారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్ల చట్టం అమలుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో కార్మికుల కనీస వేతనాల అమలును పట్టించుకోలేదని.. అధికారంలో ఉన్న పదేండ్లు కాంట్రాక్టర్లను రక్షించటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన నేతృత్వంలో కమిటీ వేసిందని గుర్తు చేశారు. 

►ALSO READ | రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు

ఇటు కార్మికులు.. అటు ఇండస్ట్రీ వారితో మాట్లాడి కనీస వేతనాలు పెంచామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా రాష్ట్రంలోని 65 ఐటీఐలను రూ.2500 కోట్లతో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ (ఏటీసీ)గా అప్ గ్రేడ్ చేశామని తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 ఏటీసీలు ఏర్పాటు చేశామన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్ విద్యార్థులకు ఏటీసీల ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.