- మైనంపల్లి హన్మంతరావు
మనోహరాబాద్, వెలుగు : పేద విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కోరారు. బుధవారం మండలంలోని దండుపల్లి శుభం గార్డెన్ లో రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి తన తల్లిదండ్రులు లక్ష్మి, రామిరెడ్డి జ్ఞాపకార్థంగా మండల కేంద్రంలోని అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్రీడా సామగ్రి, స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మైనార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
