దోచుకోవడం, దాచుకోవడమే బీఆర్ఎస్ పని : రోహిత్ రావు

దోచుకోవడం, దాచుకోవడమే బీఆర్ఎస్ పని : రోహిత్ రావు
  • కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రావు

పాపన్నపేట, వెలుగు : మెదక్​ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి దోచుకోవడం దాచుకోవడమే తెలుసని, మెదక్ నియోజక వర్గాన్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ అభ్యర్థి మైనం పల్లి రోహిత్ రావు అన్నారు. బుధవారం ఆయన పాపన్నపేట మండలం కొంపల్లి,చీకొడ్​,పాతలింగాయిపల్లి,మెదులకుంటతండా ,నార్సింగరావుపల్లి తండా, లక్ష్మీనగర్​తో పాటు తదితర గ్రామాల్లో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. మెదక్​ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్​ వేసిన పాపన్నపేటకు చెందిన కడారి ప్రభు విత్​డ్రా చేసుకొని, రోహిత్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ళు పాలించి మెదక్ నియోజక వర్గానికి వెలగ బెట్టింది ఏమిటో ప్రజలకు వివరించి ఓట్లు అడగాలన్నారు. మెదక్ లో సిద్దిపేట పెత్తనం ఎందని ప్రశ్నించారు.అక్రమ సంపాదనలతో కమీషన్ల తెలంగాణ చేశారని,ఏడుపాయల్లో దేవేందర్ రెడ్డి పెత్తనం ఎందని ప్రశ్నించారు.అమ్మవారి సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు.5ఎకరాలు ఉంటే ఈ రోజు వేల ఎకరాలు పద్మా దేవేందర్ రెడ్డికి ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. దోచుకొని దాచుకోవడం వాళ్ళ నైజం అన్నారు. కమిషన్ల పాలన వారిది సేవకుల పాలన మాదని పేర్కొన్నారు.

మాది ప్రజా బలమని, బీఆర్ఎస్ ది పైసల బలమని అన్నారు. పదేళ్ళ కాలం లో తగ్గించని సిలిండర్ ధరను ఇప్పుడు తగ్గిస్తామని గారడీ మాటలు చేప్తే నమ్మెరోజులు లేవని, ప్రజలను మోసం చేస్తూ ప్రజసొమ్ములను దోచుకుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గోవింద్​,పాపన్న పేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్,ప్రశాంత్​రెడ్డి , నరేందర్ గౌడ్, మండల కొప్షన్ సభ్యులు గౌస్,సంగమేశ్వర్​,ప్రవీణ్​తో పాటు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.