చైనాలో విస్తరిస్తున్న కొత్త వైరస్ వ్యాప్తిపై ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది...కరోనా నుంచే బయటపడి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ వైరస్ గనక వ్యాప్తి చెందితే పరిస్థితి ఏంటని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాధి ఇతర దేశాలకు వ్యాపిస్తే...ఏంచేయాలి.. వ్యాపించే ఛాన్స్ ఉందా.. సరిహద్దు దేశమైన భారత్ లో కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందా..మళ్లీ మాస్కులు పెట్టుకోవాల్సిందేనా ..మళ్లీ భౌతిక దూరం పాటించాల్సిందేనా.. శానిటైజర్లు ఉపయోగించాల్సేందే... ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి..
చైనాలో విస్తరిస్తున్న కొత్త వైరస్ భారత్ లో పలువురు డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ఫెక్షన్ మహమ్మారిలా మారుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం.. WHO ఇప్పటికే చైనాకు కొత్త వైరస్ పై పలు సూచనలు చేసింది.. వ్యాధి విస్తరణ, చికిత్స, పూర్తి వివరాలు ఇవ్వాలని చైనాను ఆదేశించింది. అయితే ట్రై ఫ్లై మాస్కులు , హ్యాండ్ శానిటైజేషన్, భౌతిక దూరం పాటంచడం వంటి వ్యక్తిగత రక్షణ పాటించడం చాలా అవసరం అంటున్నారు డాక్టర్లు.
చైనా.. ఈ మాట వింటే కరోనానే గుర్తుకొస్తుంది.. అది తగ్గి అంతా బాగుంది అనుకుంటున్న టైంలో.. ఇప్పుడు చైనాలో కొత్త వైరస్ పుట్టినట్లు ప్రపంచం భయపడుతుంది. దీనికి కారణం లేకపోలేదు.. చైనా దేశ వ్యాప్తంగా చిన్న పిల్లలు.. పసి పిల్లలు లక్షల మంది ఇప్పుడు ఆస్పత్రుల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు పిల్లలతో నిండిపోయాయి.. పిల్లల్లో న్యూమోనియా లక్షణాలతో ఉన్న కొత్త వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అది న్యూమోనియా లక్షణాలతో ఉన్నా.. న్యూమోనియా కాదు అంటున్నారు డాక్టర్లు. దీంతో చైనా వైద్య శాఖ అత్యవసర ట్రీట్ మెంట్లకు ఏర్పాట్లు చేస్తుంది. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. WHO సైతం చైనా పిల్లల్లోని వ్యాధి లక్షణాలు, ట్రీట్ మెంట్ వివరాలు తక్షణమే వెల్లడించాలని చైనా దేశాన్ని ఆదేశించింది.
ప్రస్తుత ఇన్ఫెక్షన్ మహమ్మారిలా మారుతుందా లేదా అని చెప్పడం చాలా తొందరగా ఉంది. WHO ఇప్పటికే పాలుపంచుకుంది మరియు విషయాన్ని పరిశీలిస్తోంది. ట్రై PLY మాస్క్‌ల రూపంలో వ్యక్తిగత రక్షణను పాటించడం, తరచుగా హ్యాండ్ శానిటైజేషన్ మరియు సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యమైనది" అని గురుగ్రామ్‌లోని సికె బిర్లా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ తుషార్ తాయల్ ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
చైనా.. ఈ మాట వింటే కరోనానే గుర్తుకొస్తుంది.. అది తగ్గి అంతా బాగుంది అనుకుంటున్న టైంలో.. ఇప్పుడు చైనాలో కొత్త వైరస్ పుట్టినట్లు ప్రపంచం భయపడుతుంది. దీనికి కారణం లేకపోలేదు.. చైనా దేశ వ్యాప్తంగా చిన్న పిల్లలు.. పసి పిల్లలు లక్షల మంది ఇప్పుడు ఆస్పత్రుల్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు పిల్లలతో నిండిపోయాయి.. పిల్లల్లో న్యూమోనియా లక్షణాలతో ఉన్న కొత్త వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అది న్యూమోనియా లక్షణాలతో ఉన్నా.. న్యూమోనియా కాదు అంటున్నారు డాక్టర్లు. దీంతో చైనా వైద్య శాఖ అత్యవసర ట్రీట్ మెంట్లకు ఏర్పాట్లు చేస్తుంది. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. WHO సైతం చైనా పిల్లల్లోని వ్యాధి లక్షణాలు, ట్రీట్ మెంట్ వివరాలు తక్షణమే వెల్లడించాలని చైనా దేశాన్ని ఆదేశించింది.
కొవిడ్ -19 మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనా మరొక ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది. అంతుచిక్కని న్యుమోనియా వ్యాప్తి పాఠశాల విద్యార్థులకు వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అక్కడి ఆసుపత్రులు జబ్బుపడిన పిల్లలతో నిండిపోయాయి. ఈ పరిణామంతో ప్రపంచ ఆరోగ్య నిపుణుల్లో ఆందోళన నెలకొంది. న్యూమోనియా లక్షణాలతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్న ప్రాంతాల్లో బీజింగ్, లియానింగ్ ప్రావిన్స్ ఉన్నాయి. అక్కడ చిన్న పిల్లల ఆస్పత్రులన్నీ రద్దీగా మారాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో.. బీజింగ్, లియానింగ్ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ మూసివేసింది ప్రభుత్వం. ఈ వ్యాధికి విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు సైతం గురవుతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నా.. ఈ వివరాలను వెల్లడించటం లేదు చైనా. ఇది కొవిడ్ -19 ప్రారంభ రోజులను గుర్తు చేస్తోందని కొందరు భయాందోళనలు వ్యక్తం చేయటం.. ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తుంది.