- 4న కార్మిక సంక్షేమ భవన్లో విచారణకు రికార్డులతో రావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సినీ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’కు శక్తి (కార్మిక) శాఖ నోటీసులు ఇచ్చింది. ‘ఇరుముడి’ సినిమాలో బాలికతో నిబంధనలకు విరుద్ధంగా నటింపజేయడంతో పాటు చిత్ర ప్రమోషన్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో పాల్గొనేలా చేశారన్న ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
బాల, కౌమార కార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం–1986 నిబంధనలను ఉల్లంఘించారంటూ ‘జై లోక్సత్తా (సోషల్ జస్టిస్ ఫోరం)’ వ్యవస్థాపక అధ్యక్షుడు చొల్లేటి మహేశ్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై రంగారెడ్డి జోన్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ స్పందించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు నవంబర్ 4న ‘టి.అంజయ్య కార్మిక సంక్షేమ భవన్’లో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
